కృతజ్ఞత!

నరసింహ పొలంలో బోరు తవ్వాడు. రెండేళ్ళ కొడుకు ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు.  ఊరంతా గగ్గోలు పుట్టింది.  అధికార్లు హుటాహుటిన రంగంలోకి దిగారు.  బావిలోకి దిగి కాపాడే నైపుణ్యం ఉన్న వ్యక్తిని పిలిపించారు.  చాలా శ్రమకోర్చి పిల్లాడిని కాపాడాడు ఆ వ్యక్తి.

అన్నా నీ పేరేంటి అనడిగాడు నరసింహ.  పిల్లాడికి ఆ పేరే పెట్టాడు.  పేరు మోజెస్.

ఈ కథలో పాత్రల్ని ఎలాగైనా మార్చొచ్చు.  నరసింహ స్థానంలో ఏసోబు లేదా ఆయుబ్ ఖాన్ ఉండొచ్చు. మోజెస్ స్థానంలో సిరాజుద్దిన్  లేదా సింహాచలం ఉండొచ్చు. 

మార్చలేనిదొక్కటే.  కృతజ్ఞత!    

బదిలీ

ఒక పరమభక్తుడు తనువు చాలించి స్వర్గానికి చేరాడు.  స్వర్గంలో స్వర్గసుఖాలే ఉంటాయి కనుక ఒకరోజు పూర్తిగా ఆస్వాదించాడు.  భగవంతుడు ఆ రోజు బాగా బిజీ.
మరుసటి రోజు భక్తుడిని దేవుడి సమక్షానికి  తీసుకెళ్ళారు దేవదూతలు.
“స్వామీ. సదా నీ నామస్మరణ, నేను చేసిన సత్కార్యాలు ఇవేగా నా స్వర్గలోక ప్రాప్తికి కారణాలు” అడిగాడు భక్తుడు ఆనంద పారవశ్యంతో.
“అవును” అంటూనే నరకానికి బదిలీ ఉత్తర్వులు చేతిలో పెట్టాడు దేవుడు. 
“స్వామీ ఇది అన్యాయం” కావలిసిన ప్రదేశంలో పోస్టింగ్ తెచ్చుకున్న ఉద్యోగికి నెలలోనే మళ్ళీ బదిలీ అయినట్టు ఆక్రోశించాడు. 
“నువ్వు చెప్పింది నిజమే.  అందుకే ఇక్కడికి వచ్చావు.  అయితే నువ్వు జీవితపర్యంతం  పరమత అసహనంతో బ్రతికావు.  ద్వేషాన్ని వెళ్ళగక్కావు.  వాళ్ళూ నా బిడ్డలే.  ఆచార వ్యవహారాలు వేరే.  అంతే” 
దేవదూతలు భక్తుడిని లాక్కుపోయారు.
“అయితే వాళ్ళంతా (పర మతస్తులు) ఎక్కడ చచ్చారు?” కోపంగా అడిగాడు భక్తుడు.   
“కొందరు ఇక్కడే ఉన్నారు.  చూస్తే గింజుకుంటావని నిన్న దాచిపెట్టాము.  అయినా బాధపడకు.  వాళ్ళల్లో నీలాంటి వాళ్ళు కొందరు నీకు కంపెనీగా నరకంలో కూడా ఉన్నారు” అని అక్కడికి తోసేసారు. 

విక్రమార్క @2021

పట్టువదలని విక్రమార్కుడు ఎప్పటిలాగే బేతాళుడిని భుజాన వేసుకుని బయలుదేరాడు.
విక్రమార్కా ఆ మొబైల్ కాస్త పక్కన పెట్టు.  శ్రమ తెలియకుండా నీకో కథ  చెబుతాను అన్నాడు బేతాళుడు.  
భగవంతుడిని వెతుక్కుంటూ వేర్వేరు ధర్మాలని అనుసరించే  ముగ్గురు బయలుదేరారు.  నా దారి సరైనది అంటే నా దారి సరైనది అని దెబ్బలాడుకుని ఎవరి దారి వాళ్ళు పట్టారు.
ఆశ్చర్యంగా ముగ్గురూ ఒక కూడలిలో కలుసుకున్నారు.  అక్కడో సింహం ఎదురైంది. 
దేవుడా మమ్మల్ని కాపాడు అని మనసులో ప్రార్థించారు.
ఎక్కడికిరా వెళుతున్నారు? గర్జించింది సింహం.  వెళుతున్న పని చెప్పారు.
పిచ్చివాళ్ళలా ఉన్నారే.  మీరు వెతుకుతున్న గమ్యస్థానం ఇదే అని వెళ్ళిపోయింది సింహం.
ఇదే గమ్యస్థానం అని సింహం ఎలా చెప్పింది? 
ఆకలిగా ఉన్నా వాళ్ళని తినకుండా ఎందుకు వదిలేసింది?  
ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసీ చెప్పలేకపోయావో నీ మొబైల్ వెయ్యివ్రక్కలవుతుంది. 

***                      ***                  ***

విక్రమార్కుడు గూగుల్ సెర్చ్ చెయ్యకుండానే ఇలా అన్నాడు.
దేవుడా ‘నన్ను కాపాడు’ అని కాకుండా ఎప్పుడైతే ‘మమ్మల్ని కాపాడు’ అని ప్రార్థించారో అప్పుడే వాళ్ళు గమ్యస్థానాన్ని చేరారు.
ఇంక రెండో ప్రశ్నకి.  దేవుడే ఆ సింహం.
బేతాళుడు  చెట్టు పైకి.  మనం మళ్ళీ మన మొబైల్స్‌లోకి.

7 versions!

As a writer I know how painful it is to write a story.  Some film writers claim they have written two, three or even ten versions of one story. I envy them. I tried my hand at one.

First version (Comedy)

Mr. Subrao and his wife are preparing to cut vegetables. He is ready with knife, grater, chopper etc.. His wife is ready with cotton, band aid and antiseptic lotion!

Second version (Investigation)

 Mr. Subrao went to police station. There are sixteen bruises on his fingers.
“Who is responsible for this dastardly act?” inspector asked.
“My wife”
“What did you do?”
“Cutting vegetables”

Third version (Tragedy)

Mr. Subrao loves work from home. Since he was not employed in a software company, his dream was never fulfilled. He retired. Now he works from kitchen.

Fourth version (Suspense)

”The potato kurma you prepared is awesome dear. It just tastes like non-veg.” Subrao’s wife praised him.
Subrao raised his left hand slowly. The index finger is gone.

Fifth version (Shortest film)

Mr. Subrao posted a video of his cutting the onions on social media with the caption “Why should women have all the tears”. It went viral and became an instant hit.

Sixth version (Success story)

Mr. Subrao wanted to become a writer post retirement. His first book “How to cut fingers without injuring vegetables” was a huge success.

Seventh version (Horror)

Mr. Subrao is now learning to cut vegetables with his toes.

చారూ, మై డార్లింగ్!

చారు అంటే బాల్యం నుండి నాకెంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. దాన్నే చైల్డ్‌హుడ్ క్రష్ అంటారేమో తెలీదు. పగలూ రాత్రీ చారు నామస్మరణే! చారు లేకుండా నేనుండలేననే స్థితికి వచ్చేసాను. రేయ్ అంత పిచ్చి పనికిరాదు అని మందలించేవాళ్ళు  స్నేహితులు.

అమ్మ నన్ను తోడు తీసుకెళ్ళేటపుడు ‘అమ్మా అక్కడ చారు ఉంటుందిగా’ అనడిగేవాణ్ణి ఆశగా.  ‘ఉంటుందిలే నాన్నా’  అనేది వాత్సల్యంతో.   అక్కతోపాటు వెళ్ళినపుడు ‘అక్కా చారు వస్తుందిగా’ అనడిగేవాణ్ణి అనుమానంగా.  ‘వస్తుందిలే బుజ్జీ’ అని ప్రేమగా  విసుక్కునేది. నిజంగానే  చారు వచ్చేది.  ఆనందం పట్టలేకపోయేవాణ్ణి.

చారుని ఎవరైనా విమర్శించినా, చులకనగా మాట్లాడినా భరించలేకపోయేవాడిని. ఏం తెలుసురా మీకు చారు గురించి అని కొట్లాటకి తయారైపోయేవాణ్ణి.  చారునీ, నన్నూ విడదీయాలని కుట్రలు కూడా పన్నారు. ఎవరెన్ని  చేసినా  అది అసంభవం అని విరుచుకుపడేవాడిని. ఆ ఏంటి చారు గొప్ప అని ఎవరేనా ఎత్తిపొడిస్తే ‘డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ చారు’ అని గర్జించేవాడిని.

‘నువ్వు నాకు నచ్చావ్’,  ‘నువ్వు లేక నేను లేను’,  ‘నువ్వే నువ్వే’ – ఈ సినిమా పేర్లన్నీ మా కాంబో చూసే పెట్టారు.

భగ్నప్రేమ పైన – ‘నివేదన’ అనే కవిత్వ సంకలనమూ, ‘ఏకాంత సాంత్వనము’ అనే బాధల పదాలూ, ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ‘మనసు మాట వినదు’ అనే సూపర్‌హిట్ కథా రాయడంతో ఎన్నిసార్లు, ఎంతమంది, ఎన్నిరకాలుగా ‘మీకూ ఓ ప్రేమకథ ఉంది కదూ’ అని అడిగినా నేను ఇంతకాలం బయటపడలేదనీ, ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నాననీ ఎక్సైట్ అవమాకండేం!

ప్రియే చారుశీలే అని జయదేవుడి అష్టపదో,  చారుమతి ఐ లవ్ యూ అని ఆనంద్ సినిమాలో పాటో పాడేంత దృశ్యం లేదు.
చారు అంటే చారుశీలేం కాదు, చారుమతీ కాదు!
చారు అంటే చారే. కనీసం పప్పుచారు కూడా కాదు. రసం! 
పెళ్ళిభోజనమైనా,  ఐదు నక్షత్రాల హోటల్లో విందుభోజనమైనా నాకు చారు ఉండాల్సిందే. లేకపోతే ముద్ద దిగదు.
ఒకే ఒక లోకం నువ్వే అని సిద్ శ్రీరాంలా పాడతాననుకున్నారు కదూ.
ఒకే ఒక పాకం నువ్వే అని పాడతాను.
చారు నాకు అంత ఇష్టం!  

ఖచ్చితం!

హైదరాబాద్‌లో రెండ్రోజుల సమావేశం (conference). హోటల్లో బసకి, రవాణాకి అన్ని వసతులు ఉన్నా, బాబాయ్‌గారి బలవంతంతో వాళ్ళింట్లోనే దిగాడు సుందరం.
చాలా సంవత్సరాల క్రితం వచ్చాడు వాళ్ళ ఇంటికి. అప్పట్లో ఇంటి ముందు సన్నటి  కాలిబాట ఉండేది. ఇప్పుడు ఎనభై అడుగుల రోడ్డు, మధ్యలో డివైడర్, దానిపై   పూల మొక్కలు.  కుడివైపు తిరగ్గానే యాభై అడుగుల దూరంలో నాలుగు రోడ్ల పెద్ద బ్రహ్మాండమైన కూడలి. ఎంత మారిపోయింది ఈ ప్రదేశం అని ఆశ్చర్యపోయాడు. 
క్యాబ్‌లో వెళతానన్నా వినలేదు. వాళ్ళ డ్రైవర్ ఆ రోజు సెలవైనా, అప్పటికపుడు ఫోన్లో తెలిసినతన్ని పిలిపించి కారులో పంపారు.   
ఇంటి బయటకొస్తూనే కారు కుడివైపుకి తిప్పి కూడలి చేరి మళ్ళీ కుడివైపు తిరిగి  పెద్దరోడ్డులో రయ్యిన పోనిచ్చాడు డ్రైవర్. 
మరుసటిరోజు బాబాయిగారు కూడా బయలుదేరారు నాకూ అటు పనుందోయ్ అని. వాళ్ళ అసలు డ్రైవర్ వచ్చేసాడు.
కారు ఇంటి బయటకు వస్తూనే ఎడమవైపు తిప్పాడు డ్రైవర్.
“మనం కుడివైపు కదా వెళ్ళాలి”అన్నాడు సుందరం.
“ఇటు కూడా వెళ్ళొచ్చండి”
ఎడమవైపు చాలా దూరం వెళ్ళి ఒక చోట కుడివైపుకి యూ టర్న్ తీసుకుని మొత్తం ఒక కిలోమీటరు తోలి బాబాయ్‌గారి ఇంటి ముందుగా (డివైడర్‌కి అటువైపు)  అదే పెద్ద బ్రహ్మాండమైన కూడలి దగ్గరికి వచ్చాడు.
బాబాయ్‌గారి వంక చూసాడు సుందరం.
నేనూ అదే చెబుతాను సుందరం, నాకెందుకయ్యా పెట్రోల్ దండగ అని. వినడు. ఇంటినుండి యాభై అడుగులే అయినా కుడివైపు వన్ వే అంటాడు. మావాడు చాలా ఖచ్చితమోయ్ అన్నారు బాబాయ్‌గారు. 

NOTHING BUT TRUTH!

Quote

O God! I have no enemies. If I am to have one, let his strength be equal to that of mine, That truth alone may be the victor!
– Khalil Gibran

Unquote

When there is a tussle between

Man Vs. Woman
Strong Vs. Weak
Majority Vs. Minority
….  ….
….  ….

We jump and take sides according to our prejudiced notions! We do not seek the truth.
Khalil Gibran is not valid today.  
Very sad.  My heart bleeds.

తన్నీర్ తన్నీర్ (Tanneer Tanneer)

I was searching for a house for rent in 1990s in Chennai.  Most of the paper ads under rental columns used to contain an assurance “No water problem”

But my cousin (famous poet & film writer Late Sri Anisetty’s son), a resident of Chennai, cautioned me to read them this way:
“No water.  Problem”

In a lighter vein…

1)  A friend forwarded me this meme:

 In 2006, scientists declared that Pluto is no longer a planet. Despite that, it keeps on revolving around the Sun the same way it has been doing for billions of years. Pluto doesn’t care what others think about it.

Be like Pluto!

I replied:  I can’t.   I expect people to like my fb posts!

2) Why I failed in my Science exam?

The teacher was explaining why a tube light flickers before glowing.    I was busy watching the third row second girl as to why she flickers her eyes before staring at me!

3) The ‘No’ way

There are many beautiful ways of telling ‘No’.  A marketing guy was trying to sell me a 1000 page book titled “Word power made difficult”.

I said “Hi! I am Shashi Tharoor”

4)  TWO WEEK!

Many of my friends from Tamil Nadu, Odisha and North mail me “Why your fb posts are mostly in Telugu which we cannot read?”

I wrote back: My English is two week!

5) Theory of innovation!

Necessity is the mother of invention.  Luxury is wife’s invention!

సరదాగా అలా…

  • వాక్ స్వాతంత్ర్యం!

రామారావుకి రోజూ ఉదయం నడక అలవాటు.
కాలికి దెబ్బ తగిలితే  వైద్యుడు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు.
నాకు  walk స్వాతంత్ర్యం లేదు అని వాపోయాడు రామారావు. 

  • వైద్యుడిదే తప్పు!    

వెంగళప్పకి రోజూ ఉదయం నడక అలవాటు. 
కాలికి దెబ్బ తగిలితే  వైద్యుడు కొన్ని రోజులు ఉదయం నడక మానెయ్యమన్నారు.
సాయంత్రాలు నడవొచ్చంటారా అనడిగాడు వెంగళప్ప.

  • వైద్యుడికీ గుండెపోటు!

బంగార్రాజుకి గుండెపోటు వచ్చింది.
“స్టెంట్ ఏ కంపెనీది వెయ్యమంటారు” వైద్యులు అడిగారు.
“లలితా జ్యూయల్లెర్స్ అయితే తరుగు తక్కువండి” అన్నాడు బంగార్రాజు.              

  • టైమ్‌ పాస్ 

అన్నయ్యగారూ మమ్మల్ని ఇంత మోసం చేస్తారా?
ఏమైందమ్మా
మీ అమ్మాయి బి.కామ్ చదివిందని చెప్పారు. పాస్ కాలేదంటగా.
అవునమ్మా చదివింది అని చెప్పాను పాస్ అయిందని చెప్పలేదే?